తెలంగాణలో వెలుగులోకి మరో కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా నిధులు గోల్‌మాల్
Telangana: నిధులు కాజేసిన కొందుర్గ్ మండలం తంగెళ్లపల్లి ఏఈవో
Telangana: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ ఘటన మరువక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతుబంధు, రైతు బీమా పేరిట వ్యవసాయ శాఖలోని కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడట్టు గుర్తించారు. 2 కోట్లు వరకు నిధులు గోల్‌మార్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలానికి చెందిన తంగెళ్లపల్లి ఏఈవో ఈ నిధులను కాజేశాడు. బతికున్న రైతులు చనిపోయినట్లు నకిలీ పత్రాలను ఏఈవో శ్రీశైలం సృష్టించినట్టు ఎల్ఐసీ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలైంది. ఏఈవో శ్రీశైలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిధులను ఎలా మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.