యాదగిరిగుట్టలో పెరిగిన భక్తులరద్దీ

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

Update: 2024-05-19 09:47 GMT

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తులరద్దీ

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులరద్దీ పెరిగింది.ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు.దీంతో స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో సందడి నెలకొంది.ఆలయంలో నిత్య కళ్యాణం, హోమం వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఈఓ భాస్కర్ రావ్ తెలిపారు. 

Tags:    

Similar News