TS BJP: కేంద్ర మంత్రివర్గంపై తెలంగాణ బీజేపీ నేతల ఆశలు
TS BJP: వచ్చే నెల18 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్
TS BJP: కేంద్ర మంత్రివర్గంపై తెలంగాణ బీజేపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. వచ్చే నెల 18 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా నియామకం తర్వాత.. కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేయలేదు. ఇటు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిసంజయ్‌కి సెంట్రల్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. అధ్యక్ష బాధ్యతల నుంచి బండిని తప్పించడంపై కేడర్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ సైతం కేబినెట్‌లో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే... తెలంగాణ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
కిషన్‌రెడ్డిని కొనసాగిస్తే ఒకరికి బెర్త్ ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. దక్షిణాదిలో తెలంగాణ కీలకం కావడంతో ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటు రాజ్యసభ మెంబర్‌షిప్‌పై విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, మురళిధర్ రావు, వెదిరె శ్రీరాంలు భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో అధిష్టాన నిర్ణయంపై తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ నెలకొంది.