Auto Durgamma: ఆదర్శంగా నిలుస్తోన్న ఆటో దుర్గమ్మ

Auto Durgamma: భర్త దూరమైనా ధైర్యం కోల్పోలేదు ఉపాధి లేదన్న నిరాశకు గురికాలేదు.

Update: 2021-06-04 04:41 GMT

Auto Durgamma: ఆదర్శంగా నిలుస్తోన్న ఆటో దుర్గమ్మ

Auto Durgamma: భర్త దూరమైనా ధైర్యం కోల్పోలేదు ఉపాధి లేదన్న నిరాశకు గురికాలేదు. మహిళలకు సాధ్యం కానిది లేదని తాము తలచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించింది ఓ మహిళ. ఆటోవాలాగా మారి కుటుంబ బాధ్యత తీసుకున్న ఆ మహిళ 20 ఏళ్లుగా అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆటో దుర్గమ్మగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మ‌హిళ పేరు ఆటో దుర్గమ్మ. హైదరాబాద్‌లోని భాగ్యలత ఏరియా ముదిరాజ్ కాల‌నీలో నివాస‌ముంటున్న దుర్గమ్మ దాదాపు 22 ఏళ్ల నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు. భ‌ర్త మృతి చెంద‌డం బాధ్యతలు తనపై పడటంతో కుటుంబానికి మగదిక్కుగా నిలిచింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా శభాష్ అనిపించుకున్న ఈ ఆటో దుర్గమ్మ మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

భర్తను కోల్పోయిన దుర్గమ్మ తమ్ముడి సలహాతో ఆటో డ్రైవర్‌గా మారారు. ఫైనాన్స్‌లో ఆటో కొనుక్కొని యజమాని అయినా డ్రైవర్లు హ్యాండ్ ఇవ్వడంతో స్వయంగా డ్రైవింగ్ ఫీల్డ్‌లోకి దిగారు. అలా 22 ఏళ్లుగా ఆటో నడుపుతున్న దుర్గమ్మకు ఆటోనే ఇంటి పేరుగా మారింది. ప్రస్తుతం దుర్గమ్మ రోజూ హయత్‌నగర్‌, నయాపూల్‌ మధ్య ఆటో నడిపిస్తున్నారు.

తన భర్త అనారోగ్యం బారిన పడిన నాటి నుంచి ఉపాధి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. అందుకే తాను డ్రైవర్‌గా మారాల్సి వచ్చిందని ఆటో నడిపి తన పిల్లలను పోషించి పెళ్లిలు చేశాన‌ని గ‌ర్వంగా చెబుతున్నారు ఆటో దుర్గమ్మ. ఓ మ‌హిళ డ్రైవింగ్ ఫీల్డ్‌లోకి రావడాన్ని వివిధ రకాలుగా చర్చిస్తుంది సమాజం. అయినా అవేమీ పట్టించుకోకుండా దుర్గమ్మ మనో ధైర్యంతో ముందుకెళ్లారని చెబుతున్నారు స్థానికులు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా గిరాకీలు లేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ప్రభుత్వం ఆటో దుర్గమ్మకు స‌హాయం చేయాల‌ని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News