వికారాబాద్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి
Vikarabad: బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌పై బూతు పురాణం
Vikarabad: వికారాబాద్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌పై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వికారాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్‌లో నేతలు, కార్యకర్తలతో ఆనంద్ సమావేశం నిర్వహించారు. నేటితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన నేతలతో భేటీ అయ్యారు. అయితే.. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో పార్టీ ఆఫీస్‌లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేతలు.. డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడిగా దాడి చేశారు. స
మాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై స్పందించిన వికారాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆరోపించారు. పార్టీ ఆఫీస్‌లో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారని, ప్రజలు ఎవరూ లేరని స్పష్టం చేశారు.