MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టు తీర్పు
MLA Poaching Case: ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న ధర్మాసనం
MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. జనవరి 18న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలా..? వద్దా..? అనే అంశంపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.