High Court serious on Telangana Government: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ ఆగ్రహం..
High Court serious on Telangana Government: కరోనా చికిత్సకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం అంటే నేడు విచారణ జరిగింది.
High Court serious on Telangana Government: కరోనా చికిత్సకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం అంటే నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు బుధవారం కరోనా బాధితులకు ప్రభుత్వం ఆస్పత్రుల్లో, ఇంటి వద్ద ఎలాంటి చికిత్స అందిస్తుందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బాధితులకు ఎక్కడెక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు సమాధానం ఇస్తూ గాంధీ, కింగ్ కోఠి, చెస్ట్ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అంతే కాక కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న బాధితులకు సరోజిని దేవి, ఆయుర్వేదిక్, నేచర్ క్యూర్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
అనంతరం కరోనా పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తున్నారో ప్రసార మాధ్యమాల్లో తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. చీఫ్ జస్టిస్ చెప్పిన సూచనలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు పేర్కొంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇక పోతే తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారంఅత్యధికంగా 1550 కేసులు నమోదు. నిన్న కుడా అధికంగా 1,524కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 815, మేడ్చల్‌లో 97, సంగారెడ్డిలో 61, రంగారెడ్డిలో 240, ఖమ్మం 08, కామారెడ్డి 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 02, నిర్మల్ 03, కరీంనగర్ 29, నిజామాబాద్ 17, జగిత్యాల 02 , మెదక్ 24, మహబూబ్ నగర్ 07, మంచిర్యాల 12, కొత్తగుడెం 08, జయశంకర్ భుపలపలి 12, నల్గొండ 38, సిరసిల్ల 19, ఆసిఫాబాద్ 05, ఆదిలాబాద్ 07, వికారాబాద్ 21, నగర్ కర్నూల్ 01, జనగాం 04, ములుగు 06, వనపర్తి 05, సిద్దిపేట 04, సూర్యాపేట 15, గద్వాల్ 13, కేసులు నమోదయ్యాయి. నిన్న 10 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 375 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 24,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవ్వాల ఒక్క రోజే 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.