High Court: కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ

High Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసంతృప్తి

Update: 2021-09-08 07:35 GMT
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాల ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్‌ వేచి చూడదన్న హైకోర్టు.. థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోందన్న హెచ్చరికలున్నాయని గుర్తుచేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని, కరోనాతో ఇప్పటికే అనేక మంది చనిపోయారని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నత్త నడకన కాకుండా వేగంగా కదలాలని, కరోనా కట్టడికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది.

థర్డ్‌వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని హైకోర్టుకు డీహెచ్‌ నివేదిక సమర్పించారు. నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదని, కరోనా మందులు అత్యవసర జాబితాలో చేర్చే ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వారంలో నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అలాగే.. పిల్లల చికిత్సకు అవసరమైన పడకలు, ఇతర వసతుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్‌, కేంద్ర నోడల్‌ అధికారి కోర్టులో హాజరుకావాలంది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 

Tags:    

Similar News