Here is the hostel that looks after tribal pregnant women: మారుమూల ప్రాంతాలు అంబులెన్స్‌లు వెళ్లలేని గూడేలు అక్కడ ఎండ్ల బండ్లే అంబులెన్స్‌లు. కదలకుండా కాన్పు కావాల్సినా తల్లులకు మాతృత్వం కనీళ్లను మిగుల్చుతుంది. మమకారపు మాదుర్యం తీరకముందే తనువు చాలిస్తున్నారు గిరిజన తల్లులు. సుఖ ప్రసవాలకు జననీ వెయిటింగ్ హాస్టల్ ఏర్పాటు చేశారు. మహిళల కోటి నోముల ఫలం సంతానం. అలాంటి మాతృత్వ మమకారం కోసం మహిళలు ఎక్కని కొండ మొక్కని దేవుడు ఉండడు. అయితే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సుఖంగా పురుడు పోసుకోవాల్సిన తల్లులు సకాలంలో వైద్యం అందక పుట్టేడు దుఖంతో తల్లడిల్లుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రవాణ సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్నాయి.
అయితే ఈ ప్రాంతంలో ఉన్న తల్లులకు సుఖ ప్రసవం కావాలంటే పడే అవస్థలు అన్నిఇన్నికావు. మారుమూల గూడాలకు గర్బీణీ మహిళలను ప్రసవం ఆస్పత్రికి తరలించాలంటే అంబులెన్స్ లు ఉండవు. అనేక సందర్భాలలో ఎడ్ల బండ్లలో ఆస్పత్రికి సకాలంలో చేరక మాతశిశువు మరణాలు సంభవిస్తున్నాయి.
అయితే గిరిజన తల్లుల మాతశిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా బర్త్ వేయిట్ రూమ్ లను ఉట్నూర్ కమ్యూనీటి హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలు నిండి డెలివరి కోసం పదిరోజుల ముందు గిరిజన మహిళలను బర్త్ వెయిట్ రూమ్ లకు తరలిస్తారు. అక్కడే గిరిజన మహిళలకు అవసరమైన పోషకాహరం, వైద్య సదుపాయం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డాక్టర్లు చికిత్స చేసేలా ఏర్పాట్లు చేశారు. బర్త్ వెయిట్ రూమ్ లలో సుఖ ప్రసవం జరిగిన తర్వాత సిబ్బంది తల్లిని, శిశువును సురక్షితంగా ఇంటికి చేర్చుతామని అధికారులు అంటున్నారు . జననీ వేయిట్ రూమ్ ఏర్పాటు వల్ల మాత శిశు మరణాలు తగ్గుతాయని డాక్టర్లు అంటున్నారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి సుఖ ప్రసవాల కోసం వస్తూ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను తొలగించడానికి వీటిని ఏర్పాటు చేశామంటున్నారు.