తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!
Heavy Rains In Telangana : తెలంగాణ రాష్ట్ర్రంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో వాయుగుండం ప్రభావమూ ఉందని తెలిపింది.
Heavy Rains In Telangana : తెలంగాణ రాష్ట్ర్రంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో వాయుగుండం ప్రభావమూ ఉందని తెలిపింది. దీనివల్ల సరిహద్దు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక మిగిలిన చోట్లలలో తేలికపాటి వర్షాలు కురసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకి భాగ్యనగరం అతలాకుతలం అయిపొయింది. రోడ్డ్లన్ని జలమయం అవ్వడంతో నగరవాసులు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.
ఇక GHMC పరిధిలో వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని గురువారం సీఎం కేసీఆర్ తెలిపారు. వర్షాలతో పూర్తిగా ఇళ్ళు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలతో కొట్టుమిట్టు ఆడుతున్న ప్రజలకు యుద్ధ ప్రతిపాదికన సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి ముడు రగ్గులు, నిత్యావసర సరుకులు అందించాలన్నారు. వరదల్లో పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నాలల పై కట్టిన ఇళ్ళు కూలిపోయిన వారికి ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారని సీఎం తెలిపారు.