Weather Update: తెలంగాణపై తుఫాన్ ప్రభావం..నేడు తెలంగాణకు భారీ వర్షసూచన

Weather Update:వర్షాకాలం ప్రారంభమైంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ కావాల్సినంత వర్షాలు పడటం లేదు. రైతన్నలు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాలు లేకుంటే పంటలు వేయలేరు. భూగర్భ జలాలు నిండవు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంది..తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.

Update: 2024-07-08 02:28 GMT

Weather Update: తెలంగాణపై తుఫాన్ ప్రభావం..నేడు తెలంగాణకు భారీ వర్షసూచన

Weather Update:నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది. అయితే ఇవాళ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉదయం 8 తర్వాత ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, కాకినాడలో మోస్తరు వర్షం పడుతుంది. ఉదయం 10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వాన పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది రోజంతా కంటిన్యూ అవుతుందని పేర్కొంది.

ఇక సాయంత్రం 4 తర్వాత హైదరాబాడద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షం పడుతుంది. సాయంత్రం 5 లేదా 6 తర్వాత ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాత్రి 1 గంట వరకు అలాగే కురుస్తుందని తెలిపింది. తెలంగాణలో గంటల 11 నుంచి 12కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుందని..వర్షం పడే సమయంలో గాలలు వేగం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Tags:    

Similar News