నాగార్జునసాగర్ 16 గేట్లు ఎత్తివేత
Nagarjuna Sagar Dam gates Open : నాగార్జునసాగర్ లోకి భారీగా చేరిన వరద నీటితో జలాశయం కళకళలాడుతోంది.
Nagarjuna Sagar Dam gates Open : నాగార్జునసాగర్ లోకి భారీగా చేరిన వరద నీటితో జలాశయం కళకళలాడుతోంది. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగడంతో అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రాజెక్టుకు సంబంధించిన 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇక ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తతం సాగర్ లో ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది. ఇక సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,70,903 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 305.8416 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312. 0405 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుతం అధికారులు 3,37,088 క్యూసెక్కుల నిటీని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు.
దీంతో సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. కాగా ఈ సుందర కరోనా నేపథ్యంలో ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు చూడడానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తుందని అధికారులు ఎవరూ నాగార్జున సాగర్‌కు రాకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పర్యాటకులు నాగార్జున సాగర్‌కు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా నదిపై నర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ వరద జలాలన్నీ నాగార్జున సాగర్‌కు చేరుకుంటున్నాయి.