Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు సాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 77 వేల 480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు సాగర్ ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 77 వేల 480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 295.9925 టీఎంసీలుగా ఉంది. ఇక సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3 లక్షల 20 వేల 352 క్యూసెక్కులుగా ఉంది.