MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
MLC Kavitha: ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వాదనలు
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై మూడో రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ కేసులో చాలా మంది నిందితులకు కోర్టులు బెయిల్ తిరస్కరించాయని తెలిపారు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించిన విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో..ఇండో స్పిరిట్స్ కంపెనీ 192 కోట్ల మేర లాభం పొందినట్లు తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉన్నారన్నారు. లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా..జీఓఏఎం సిఫార్సులు లేకుండా.. కమీషన్ రేట్లు 5 నుంచి 12 శాతం పెంచినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈడీ తరఫు లాయర్.