ఎండ‌లు దంచుతున్నాయి.. ఆ 4 గంట‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కండి..

Telangana: తెలంగాణలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీహెచ్‌ శ్రీనివాసరావు.

Update: 2022-03-31 13:49 GMT

ఎండ‌లు దంచుతున్నాయి.. ఆ 4 గంట‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌కండి.. 

Telangana: తెలంగాణలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీహెచ్‌ శ్రీనివాసరావు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పని పరిస్థితి అయితే తప్ప.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రాధమిక కేంద్రాలు, అంగన్‌వాడీ, సబ్‌ సెంటర్లలో ORS ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు డీహెచ్‌.

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, 20కి పైగా జిల్లాల్లో అసలు కేసులే లేవని స్పష్టం చేశారు డీహెచ్‌ శ్రీనివాసరావు. కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌తో ఈ రిజల్ట్‌ సాధించామన్నారు. కేంద్రం కరోనా ఆంక్షలు తొలగించినప్పటికీ, మాస్క్, భౌతికదూరం పాటించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్క్‌ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు డీహెచ్. 

Tags:    

Similar News