Hyderabad: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెన్షన్
Hyderabad Central University: హెచ్‌సీయూ వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad Central University: హెచ్‌సీయూ వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన రవిరంజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో... థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రవిరంజన్‌పై మూడు కేసులు ఉన్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.