Harish Rao: వైద్యవిద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

Harish Rao: అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం

Update: 2023-02-25 01:44 GMT

Harish Rao: వైద్యవిద్యార్థి ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

Harish Rao: హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతన్న వైద్య విద్యార్థిని ప్రీతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా నిమ్స్‌కు వెళ్లిన హరీశ్ రావు ప్రీతి ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి నిమ్స్‌ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌ ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్యం అందించాలని , అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు హరీశ్ రావు. 

Tags:    

Similar News