Harish Rao: సచివాలయానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?

Harish Rao: బిల్లులను ఆపడమంటే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడం కాదా?

Update: 2023-05-04 15:00 GMT

Harish Rao: సచివాలయానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?

Harish Rao: తెలంగాణ మంత్రులకు.. గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇరు వర్గాల మధ్య హైవోల్టేజ్‌లో మాటకు మాటలు పేలుతున్నాయి. తాజాగా గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్‌గా, మహిళగా తమిళిసైని గౌరవిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా? ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ ప్రవర్తన ఉందని హరీష్ రావు విరుచుకుపడ్డారు.

ఆమె వ్యవహారశైలి బాధ కలిగిస్తోందన్నారు. వైద్య విద్య ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు బిల్లు 7 నెలలు ఆపడం అవసరమా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరనే పదవీ విరమణ వయసు పెంచామని తెలిపారు. వర్సిటీల ఉమ్మడి నియామకాలు ఇతర రాష్ట్రాలు చేపట్టడం లేదా అని ఆయన అడిగారు. ఈ చర్య పేదలకు వైద్యం, పిల్లలకు చదువును దూరం చేయడమేనన్నారు. కోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదన్నారు. రాజ్యాంగానికి లోబడి పంపిన బిల్లులను గవర్నర్ ఆపడంలో ఆంతర్యమేంటో తెలియడం లేదన్నారు.

Tags:    

Similar News