Harish Rao: రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష

Harish Rao: గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలి

Update: 2023-09-04 13:50 GMT

Harish Rao: రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష

Harish Rao: రైతు రుణమాఫీపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావుతో పాటు వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్షన్నారు.

ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే లక్షలోపు ఋణాలు మాఫీ చేసిందని.. మిగతావారికి ప్రాధాన్యతా క్రమంలో రుణమాఫీ జరుగుతుందని మంత్రి తెలిపారు. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదని.. వీరికి వెంటనే అందజేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఈ నెలఖరులోగా అందరికి రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News