Harish Rao: గజ్వేల్ అభివృద్ధి గజమాల వంటిది
Harish Rao: పక్కరాష్ట్రాల వారు ఇక్కడి అభివృద్ధిని చూసి వెళుతున్నారు
Harish Rao: గజ్వేల్‌లో బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గజ్వేల్ అభివృద్ధి గజమాల వంటిదని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడ వలసలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని... ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇతర రాష్ట్రాల వారు వచ్చి... ఇక్కడి అభివృద్ధిని చూసి వెళుతున్నారని హరీశ్ రావు చెప్పారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ రింగు రోడ్డుతో పాటు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములు నిర్మించారని పేర్కొన్నారు.