Telangana: మహాలక్ష్మి పథకానికి మార్గా దర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం..
Telangana: ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం
Telangana: తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుమీద ఉండాలని గైడ్‌లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పథకం అమలు కోసం గడిచిన మూడేళ్ల గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది.