Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం
Green India Challenge: త్వరలో ఊరికో జమ్మిచెట్టు.. గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం
Green India Challenge: తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.
తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవటం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాధాన్యతల నేపధ్యంలో రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని బేగంపేటలో జరిగిన పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. ఇప్పటికే ఇరవై వేలకు పైగా జమ్మి మొక్కలను సిద్దం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు పంపిణీ చేస్తామన్నారు.