గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రిజర్వేషన్ల వివరాలు ఇవే..

Greater Hyderabad elections: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు డివిజన్ల వారీగా ఇలా ఉన్నాయి..

Update: 2020-11-01 01:51 GMT

గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి రిజర్వేషన్లను రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈసారి ఎన్నికల్లోనూ యథావిథిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు గ్రేటర్ అధికారులు డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది స్థానాలు రిజర్వు అయ్యాయి. మొత్తంగా మహిళలకు 75 డివిజన్లను రిజర్వు చేశారు. 44 స్థానాలు అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీలో ఉన్నాయి. ఆ వివరాలు..

ఎస్టీ(జనరల్‌)- ఫలక్‌నుమా

ఎస్టీ(మహిళ)- హస్తినాపురం

ఎస్సీ(జనరల్‌)- కాప్రా, మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ, జియాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.

ఎస్సీ(మహిళ)- రాజేంద్రనగర్‌, అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్‌పేట్‌, కవాడిగూడ

బీసీ (జనరల్‌)

చర్లపల్లి, సిఖ్‌చావ్నీ, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహల్‌, పురానాపూల్‌, దూద్‌బౌలి, జహనుమా, రామ్‌నాస్‌పుర, కిషన్‌బాగ్‌, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్‌, కార్వాన్‌, నానల్‌నగర్‌, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌, అంబర్‌పేట, భోలక్‌పూర్‌, బోరబండ, రామచంద్రాపురం, పటాన్‌చెరూ, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్‌.

బీసీ (మహిళ)

రామంతాపూర్‌, ఓల్డ్‌ మలక్‌పేట, తలాబ్‌ చంచలం, గౌలిపుర, కుర్మగూడ, కంచన్‌బాగ్‌, బార్కాస్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట, ఘాన్సీబజార్‌, సులేమాన్‌ నగర్‌, అత్తాపూర్‌, మంగళ్‌హాట్‌, గోల్కొండ, టోలీచౌకి, ఆసిఫ్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, అహ్మద్‌నగర్‌, మల్లేపల్లి, రెడ్‌హిల్స్‌, గోల్నాక, ముషీరాబాద్‌, ఎర్రగడ్డ, చింతల్‌, బౌద్ధనగర్‌, రామ్‌గోపాల్‌పేట్‌.

మహిళ(జనరల్‌)

డా. ఎ.ఎస్‌.రావు నగర్‌, నాచారం, చిలుకానగర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌, రామకృష్ణాపురం, సైదాబాద్‌, ముసారాంబాగ్‌, ఆజంపుర, మొగల్‌పుర, ఐఎస్‌ సదన్‌, లంగర్‌హౌస్‌, గన్‌ఫౌండ్రీ, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట, బాగ్‌అంబర్‌పేట్‌, అడిక్‌మెట్‌, గాంధీనగర్‌, ఖైరతాబాద్‌, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌, భారతీనగర్‌, బాలాజీనగర్‌, అల్లాపూర్‌, వీవీ నగర్‌, సుభాష్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, అల్వాల్‌, నేరేడ్‌మెట్‌, వినాయకనగర్‌, మౌలాలీ, గౌతంనగర్‌, తార్నాక, సీతాఫల్‌మండీ, బేగంపేట్‌, మోండా మార్కెట్‌.

రిజర్వు కానివి

మల్లాపూర్‌, మన్సూరాబాద్‌, హయాత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, చంపాపేట్‌, లింగోజిగూడ, కొత్తపేట్‌, చైతన్యపురి, గడ్డిఅన్నారం, అక్బర్‌బాగ్‌, డబీర్‌పుర, రెయిన్‌బజార్‌, పత్తర్‌గట్టి, లలితాబాగ్‌, రియాసత్‌నగర్‌, ఉప్పుగూడ, జంగమ్మెట్‌, బేగంబజార్‌, మైలార్‌దేవ్‌పల్లి, జాంబాగ్‌, రాంనగర్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్‌, రహ్మత్‌నగర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీకాలనీ, మూసాపేట్‌, ఫతేనగర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, సూరారం, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి.

Tags:    

Similar News