Bandi Sanjay: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు

Bandi Sanjay: మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

Update: 2023-04-07 01:57 GMT

Bandi Sanjay: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు

Bandi Sanjay: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండులో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరైంది. హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద సంజయ్‌కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రశ్న పత్రాల లీకేజీపై విచారించేందుకు మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇరువర్గాల వాదోపవాదనలు విన్న కోర్టు... బండి సంజయ్‌కు 20వేల రూపాయల పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కమలపూర్‌లో జరిగిన హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడని అభియోగాలతో కేసు నమోదు చేశారు. సంజయ్ ప్రోద్భలంతోనే కమలపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలనుంచి ప్రశ్నపత్రం సేకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బండి సంజయ్ పై 120(బి), 420,447,505(1)(బి) IPC, 4(A), 6, RED WITH8F తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పోలీసులు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన సతీమణి అపర్ణ పేర్కొన్నారు. రాత్రి రాత్రి బండి సంజయ్‌ను యాదాద్రి జిల్లా బొమ్మల రామారం తీసుకెళ్లారు. పోలీసులు బండి సంజయ్‌ ఎక్కడున్నాడనే విషయాన్ని తెలియనీకుండా..పోలీస్ కాన్వాయ్ వాహనాలను అటూ ఇటూ తిప్పే ప్రయత్నంచేశారు.

ఎట్టకేలకు మొన్న హన్మకొండ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన మేజిస్ట్రేట్ బండి సంజయ్‌ను రెండు వారాలపాటు రిమాండ్ కు ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో బండి సంజయ్ ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. నిన్న బెయిల్ పిటిషన్‌ దాఖలుతో బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరుపట్ల తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బెయిల్ మంజూరైన బండి సంజయ్ ఇవాళ విడుదలవుతారు.

Tags:    

Similar News