పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం..

Graduate MLC Bypolling: తెలంగాణలో వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతుంది.

Update: 2024-05-27 03:49 GMT

పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం..

Graduate MLC Bypolling: తెలంగాణలో వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్​ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్, 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్‌ కాల్స్‌ ద్వారా ఆయా పార్టీల అధినేతలతో పాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు కాగా, లక్షా 75 వేల 645 మంది మహిళలున్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.

Tags:    

Similar News