Palvai Harish Babu: ఉత్తర తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది

Palvai Harish Babu: నిధులు కేటాయించకుంటే మహారాష్ట్రలో మా ప్రాంతాన్ని కలిపేయండి

Update: 2024-07-30 17:15 GMT

Palvai Harish Babu: ఉత్తర తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది

Palvai Harish Babu: ఉత్తర తెలంగాణపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంతానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు లేవని ఆవేదన చెందారు. తమ జీవన ప్రమాణాలు పెంచి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తమపై ఇంతటి వివక్ష లేదని... ప్రత్యేక రాష్ట్రంలో ఎందుకని ప్రశ్నించారు హరీశ్ బాబు.

Tags:    

Similar News