Crime News: బేగంబజార్‌లో దారుణం.. భార్య, కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య

Hyderabad: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని, తొఫ్ఖానాలో ఘోరం జరిగింది.

Update: 2024-12-13 02:52 GMT

Crime News: బేగంబజార్‌లో దారుణం.. భార్య, కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య

Hyderabad: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని, తొఫ్ఖానాలో ఘోరం జరిగింది. సిరాజ్ అనే వ్యక్తి, భార్యను గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కుమారుడు భయాందోళనకు గురై తప్పించుకున్నాడు. హత్యలకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్ అలీ, భార్య హేలియ, కుమారుడు హైజాన్.. కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సిరాజ్(Siraj) భార్య, కొడుకుని హత్య చేసిన తర్వాత సూసైడ్ నోటు రాసి ఉరి వేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిరాజ్ కుటుంబం.. బ్రతుకు దేరువు కోసం నగరానికి వచ్చారు. ఈ ఘటనకు కారణం తెలియరాలేదు. కాగా సూసైడ్ నోటులో ఏం రాశాడో తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News