School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 5 రోజులు సెలవులు..పండగే పండగ

School Holidays
School Holidays: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. వరుసగా ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. తెలంగాణలో 2025 మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు పాఠశాలలకు ఐదురోజులు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు విద్యార్థులకు ఏకంగా ఐదు రోజులు వచ్చాయి. మార్చి 28న జుమాతుల్ విదా, షబ్ ఏ ఖద్ర్ కోసం ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ఇచ్చింది. అందువల్ల ఈ రోజుల చాలా పాఠశాలలో సెలవు ఉంటుంది. ఇది ఆప్షనల్ సెలవు కాబట్టి ఎప్పుడైనా అసలైన సెలవు ఉన్న రోజు స్కూల్ నిర్వహించుకోవచ్చు. అందువల్ల నేడు చాలా పాఠశాలల్లో ఆప్షనల్ సెలవు ప్రకటించారు. అలా నేడు విద్యార్థులకు సెలవు వచ్చింది.
మార్చి 29న రెండవ శనివారం, మార్చి 30 ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు కూడా విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తాయి. అందువల్ల 28, 29,20 తేదీలు వరుసగా సెలవులు వచ్చినట్లయ్యింది. అయితే 30 వ తేదీ ఉగాది కూడా ఉంది. ఆ రోజు పండగ సందర్బంగా సెలవు ఉంటుంది. కానీ ఆదివారం పండగ కావడంతో ఆ రోజు సెలవు అందులోనే కలిసిపోయింది.
ఇక రంజాన్ పండగ 31 లేదా ఏప్రిల్ 1న జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 31, ఏప్రిల్ 1న పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. అందువల్ల సోమవారం, మంగళవారం కూడా విద్యార్థులకు సెలవు ఉంది. అయితే కొన్ని పాఠశాలల్లో రంజాన్ పండగను మార్చి 31న నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నారు. ఆ ప్రకారం ఆ పాఠశాలల్లో సెలవులు ఉంటున్నాయి.
తెలంగాణ నుంచి ఊళ్లకు వెళ్లాలి అనుకునేవారు..ఈ ఐదు రోజులు సెలవులను ప్లాన్ చేసుకుని వెళ్లవచ్చు. అయితే వీటిలో ఏదైనా ఒక తేదీలో పాఠశాల ఉంటే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ ఒక్క రోజు సెలవు ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఏపీలో ఏప్రిల్ 1లో సెలవుల విషయానికి వస్తే మార్చి 28, ఏప్రిల్ 1 వరకు కొంత భిన్నంగా ఉంది. ఏపీ ప్రభుత్వం మార్చి 31న ఈద్ ఉల్ ఫితర్ కోసం ఒకే రోజు సెలవును ప్రకటించింది. మార్చి 28 ఆప్షనల్ సెలవు లేదు. కానీ మార్చి 29 రెండవ శనివారం, మార్చి 30 ఆదవారం కావడంతో మొత్తం మూడు రోజులు సెలవులు లభిస్తాయి. ఏపీలో అధికారిక గెజిట్ ప్రకారం అదనపు సెలవులు లేవు. కానీ విద్యార్థులు ఈ మూడు రోజులు ఉపయోగించుకోవచ్చు.