AP, TS బస్సు ప్రయాణికులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. డిమాండ్‌ను బట్టి సర్వీసులు నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. సర్వీసులన్నీ ప్రారంభం కావడానికి సుమారు 5, 6 నెలల సమయం పట్టొచ్చని చెబుతున్నారు కృష్ణబాబు..