కాళేశ్వరం వద్ద గోదావరిలో పెరుగుతున్న వరద
*పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తున్నగోదావరి
Kaleshwaram Project: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమంలో వరద నీరు చేరుతోంది. దీంతో క్రమక్రమంగా గోదావరి నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతోంది. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ లోకి వరద నీరు భారీగా చేరడం వల్ల బ్యారేజ్ నిండు కుండాల తలపిస్తోంది.
నీటిమట్టం క్రమక్రమంగా పెరగడంతో అధికారులు 35 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి నీటి సామర్థ్యం 16.17 TMCలు. ఇన్ ఫ్లో, అవుట్ ప్లో 3 లక్షల 85 వేల 630 క్యూసెక్కులు. అటు అన్నారంలోని సరస్వతి బ్యారేజ్‌లోకి వరద తాకిడి పెరిగింది. బ్యారేజ్ 34 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో, అవుట్ ప్లో 76 వేల 500 క్యూసెక్కులు.