GHMC Elections 2020: రెండో రోజు భారీగా నామినేషన్లు!
GHMC Elections 2020: * ఇవాల్టీతో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ * రెండో రోజు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు * టీఆర్ఎస్ నుంచి 195 నామినేషన్లు దాఖలు * బీజేపీ నుంచి 140 మంది, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27 మంది నామినేషన్‌లు దాఖలు * ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
గ్రేటర్ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. రెండవ రోజు నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. గురువారం భారీగా నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇవాల్టీతో గడువు ముగుస్తుండడంతో దాదాపుగా ఇప్పటికే టికెట్ ఖరారైన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు 522 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వార్ క్రమేపీ హీటెక్కుతోంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాతి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 18 నుంచి మొదలైన నామినేషన్‌ల ప్రక్రియ 20 వరకు కొనసాగనుంది. దాంతో.. రెండవ రోజు భారీగా నామినేషన్ దాఖలయ్యాయి. నామినేషన్‌ల ప్రక్రియకు ఇవాల్టీతో ముగుస్తుండడంతో దాదాపు ఇప్పటికే టికెట్ ఖరారైన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు.
రెండో రోజు దాదాపు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గురువారం దాఖలు చేసిన నామినేషన్‌లలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 195 దాఖలు అయ్యాయి. ఆ తర్వాత బీజేపీ నుంచి 140 మంది, కాంగ్రెస్ 68, ఎంఐఎం 27, టీడీపీ 47, వైసీపీ 1, సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం 4 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 15, స్వతంత్ర అభ్యర్థులు 110 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
కాగా, నామినేషన్ల గడువు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. దాంతో చివరి క్షణంలో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.