GHMC Elections 2020: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చు ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్
బల్దియా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు.. ప్రచారంలో తమ వెంట నడిచే కార్యకర్తలకు పెట్టే భోజనం, చాయ్, సమోసా రేట్లను ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది.
బల్దియా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు.. ప్రచారంలో తమ వెంట నడిచే కార్యకర్తలకు పెట్టే భోజనం, చాయ్, సమోసా రేట్లను ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును 5 లక్షలకే పరిమితం చేసింది ఎలక్షన్ కమిషన్. ఏయే వస్తువుకు ఎంత ధరో అనేది కూడా నిర్ణయించింది.
ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరల ప్రకారం ప్రచార ఖర్చును నిర్ణయిస్తారు. 2016 ఎన్నికల సమయంలో చాయ్ 10 రూపాయలు కాగా, కాఫీ 12 ఉండగా... ఇప్పుడు వీటి ధరలను వరుసగా 5, 10 రూపాయలుగా నిర్ణయించారు. నాలుగు ఇడ్లీలకు 20, ప్లేట్ వడ 20, ఆలు సమోసా 10, ఇరానీ సమోసాకు 3 రూపాయలుగా నిర్ణయించారు. కిందటి సారి చికెన్ బిర్యానీ 140 ఉండగా.. ఇప్పుడు 150 రూపాయలు చేశారు. ఇక వెజ్ ఫ్రైడ్ రైస్ ధరను 65 నుంచి 80కి పెంచారు. మటన్ బిర్యానీ 170 నుంచి 160 రూపాయలకు తగ్గించారు. ప్రచారంలో బ్యానర్లు, జెండాలు, వేసే వేదికలు.. టెంట్లు ఇలా.. ప్రతి దానికి ఓ ధరను నిర్ణయించారు.
ఒక్కో పార్టీ కండువాకు 20, మాస్కుకు 20 రూపాయల చొప్పున ఖర్చు అభ్యర్థుల లెక్కల్లోకి వెళ్తుంది. వాహనాల రోజువారీ అద్దె, డ్రైవర్లు, క్లీనర్ల బత్తా, ఆహార పదార్థాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఆటోలకు అంటించే స్టిక్కర్లు,.. ఇలా అన్నింటికీ ధరలను ప్రకటించింది. వాటి ఆధారంగా డివిజన్ల వారీ పోటీ చేసే అభ్యర్థుల ఎన్నిక ఖర్చును లెక్కిస్తారు.
ఒక రోజుకు ఇండికా కారు డ్రైవరు బత్తాతో కలిపి 1,200, ఎనిమిది నుంచి 16 మంది కూర్చునే మ్యాక్సీ క్యాబ్‌లకు 1,700, ఆటోకు 350, మినీ లారీ 1700, బస్సు 3వేల900, ట్రాక్టరుకు 1,400 రూపాయలుగా నిర్దేశించారు. 400 వాట్స్ లౌడ్ స్పీకర్లు రెండింటికి 3వేల850, ఐదుగురు కూర్చునే వేదిక ఖర్చు 2వేల200గా నిర్దేశించారు. చిన్న జెండాలకు 30, పెద్దవైతే 61గా నిర్ధారించారు. ఎన్నికల వేళ ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారన్నది గుర్తించేందుకు డివిజన్ల వారీగా పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశారు.
ఏయే వస్తువుకు ఎంత ధరో..
టీ, కాఫీ రూ.5, 10
వాటర్ ప్యాకెట్ రూ.1
వాటర్ బాటిల్ 200 ఎం.ఎల్ రూ.5
వాటర్ బాటిల్ 500 ఎంఎల్ రూ.10
వాటర్ బాటిల్ 1 లీటరు రూ.20
పులిహోర 300 గ్రాములు రూ.35
ఆలు సమోస రూ.10
వెజ్ బిర్యానీ రూ.100
చికెన్ బిర్యానీ రూ.150
ఎగ్ బిరియానీ రూ.120
మటన్ బిరియానీ రూ.160
వెజ్ ఫ్రైడ్ రైస్ రూ.80
ఇడ్లీ ప్లేటు రూ.20
వడ ప్లేటు రూ.20
వెజ్ మీల్స్ రూ.70
జెండాలు, వేదికలు, గుడ్డ జెండాలు
చిన్న సైజు రూ.30
పెద్ద సైజు రూ.61
ప్లాస్టిక్ జెండాలు రూ.30
స్టార్ ఫ్లెక్సీలు రూ.20
లైట్, స్టార్ ఫ్లెక్సీలు రూ.30
కటౌట్లు రూ.1700
10 ఫీట్లు- రూ.2200
కుర్చీలు రోజుకి రూ.7
గ్రీన్ మ్యాట్ రూ.2
టెంట్ రోజుకి రూ.1100
కార్ల అద్దె రూ.1200 నుంచి రూ.1700