Gambling mafia takes another turn in Mancherial: జూదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ రాక్షస క్రీడ వేలాది కుటుంబాలను రోడ్డుకీడుస్తోంది. జూదానికి బానిసలుగా మారిన వేలాది మంది దురాశకు లోనై తమ ఆస్తులను అమ్ముకొని దారిద్య్రాన్ని కూడగట్టుకుంటున్నారు. ఈ క్రీడలను నిర్వహించే నిర్వాహకులు మాత్రం కోట్ల రూపాయాలను దండుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎళ్లలు దాటుతున్న జూదంపై దృష్టి సారించారు. మంచిర్యాల జిల్లాలో జూదం మాపియా రూట్ మార్చింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ రాక్షస క్రీడా జోరుగా సాగుతోంది. నిత్యం లక్షలాది రూపాయలను పందెం కాస్తూ జూదం మాఫియా తన కార్యకలాపాలను గుట్టు చప్పు డు కాకుండా నిర్వహిస్తోంది. పోలీసుల కళ్లుగప్పి ముఠా సభ్యులు స్థావరాలు మారుస్తూ ఆచూకీ తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
ఈ జూదానికి శంకర్, తిరుపతి అనే ఇద్దరు వ్యక్తలు సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారు. జూదం ఆడే వారికి ప్రత్యేకంగా వాహానాలు సమాకూర్చి జూదం ఆడే ప్రాంతానికి తరలిస్తారు. పోలీసుల కంటపడకుండా జంగల్ లో జూదం స్థావరాలను నిర్వహిస్తున్నారు. పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో జూదం స్థావరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శంకర్, తిరుపతిల పై పీడీ కేసులు నమోదు చేశారు. ఇంకా ఎవరైనా జూదం నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా సరదా కోసం ఆడే ఈ జూదం రాకాసిగా మారి అనేక కుటుంబాల్లో విషాదం నింపుతుంది. అనేక మంది జీవితంతో ఆటాలాడుకుంటుంది.