Gadwal: వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. కుట్లు వేయకుండా ఫెవీక్విక్‌ పెట్టిన ప్రబుద్దులు..

Gadwal: గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాకం బట్టబయలైంది.

Update: 2023-05-06 05:17 GMT

Gadwal: వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. కుట్లు వేయకుండా ఫెవీక్విక్‌ పెట్టిన ప్రబుద్దులు..

Gadwal: గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాకం బట్టబయలైంది. ఆడుకుంటున్న సమయంలో ఓ బాలుడి ఎడమ కన్ను పైభాగంలో గాయమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అంటించారు అక్కడి సిబ్బంది. ఇది గమనించిన తల్లిదండ్రులు.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై నరేశ్‌ కుమార్‌ తెలిపారు.

Tags:    

Similar News