తెలుగు యూనివర్శిటీలో గద్దర్ సంస్మరణ సభ..
Gaddar: ఆటపాటలతో ఎంతోమందిని ప్రభావితం చేశారు
Gaddar: ప్రజాకవి,గాయకుడు గద్దర్ భౌతికంగా దూరమైనప్పటికీ... ఆయన పాటలు, ఉద్యమ పంధా ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని పలువురు వక్తలు స్మరించుకున్నారు. గద్దర్ తన ఆట, పాటలతో కోట్ల మందికి ప్రేరణగా నిలిచారని ప్రస్తావనకు తెచ్చారు. హైదరాబాద్ తెలుగు యూనవర్శిటీలో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సీనీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, రచయిత్ర ఓల్గా, నటి ఉదయభాను గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సమాజంపట్ల, బావితరాల భవిష్యత్తు పట్ల గద్ధర్ దార్శనికంగా వ్యవహరించి ఉద్యమ పంధా కొనసాగించిన తీరు, తెలంగాణ ఉద్యమంలో గద్ధర్ పాత్ర కీలకంగా నిలిచిందని ప్రస్తావించారు.