Hyderabad: హైదరాబాద్ లో పొంచి ఉన్న ఇంధన కొరత
Hyderabad: నగరంలో 20శాతం పెట్రోల్, డిజీల్ కొరత
Hyderabad: నగరంలో ఇంధన కొరత ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. సీటిలో బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమివ్వటం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 20శాతం పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అయిల్ కంపెనీలు వాస్తవ కోటాకు 25శాతం కోత విధించడం అదే సమయంలో క్రెడిట్ విధానాన్ని రద్దు చేయటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఈ నెల 31న నిరసన తెలుపుతాం అంటున్నరు పెట్రోల్ బంక్ ల యజమానులు
గత వారం రోజులుగా నగరంలో కొన్ని బ్యాంకుల్లో డీజిల్, పెట్రోల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు నిల్వల కొరతపై తీవ్ర దుమారం రేగుతున్నప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కోటా విధానాన్ని అమల్లోకి తేవటం ఇంధన కొరతకు కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వీపరీతంగా పెరిగినందున, పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 25 రూపాయలు నష్టం వస్తోందని అందువల్ల తగినంత సరఫరా చేయలేనిమని భారత్ పెట్రోల్ బంక్ కార్పోరేషన్ బంకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్రెడిట్ విధానం రద్దు కావటం కొంత ఇబ్బందికరంగా మరిందని డీలర్లు చెబుతున్నారు. ముందు డబ్బు చేల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు డబ్బులు చెల్లించినా కోటాలో 75శాతం మాత్రమే సరఫరా చేస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికే ఈ కారణాలతో 20శాతం ప్రభావం బంకులపై పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వినియోగం మాత్రం రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదని డీలర్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలోనే పెట్రోల్ 35శాతం, డిజీల్ 25శాతం వినియోగం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకు అన్యాయం జరుగుతూనే ఉంది కాబట్టి డీలర్ల దగ్గర డీజిల్ కొనుగోలు చేయమని పెట్రోల్ బంకుల నిర్వహకులు అంటున్నారు.
ఇక సిటీలో మొత్తం 500ల వరకు బంకులు ఉండగా.. ప్రతిరోజు 35లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు గణంకాల ద్వారా తెలుస్తోంది. నగరంలో 72లక్షలకు పైగా వాహనాలు ఉండగా.. ప్రతిరోజు వెయ్య వరకు కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి.