Hyderabad Metro: మెట్రోలో తరుచుగా సాంకేతిక లోపాలు

Hyderabad Metro: రాయదుర్గం. అమీర్ పేట్ రూట్ లో తరచుగా సాంకేతిక లోపాలు

Update: 2023-01-25 03:33 GMT

Hyderabad Metro: మెట్రోలో తరుచుగా సాంకేతిక లోపాలు

Hyderabad Metro: హైదరాబాద్ లోని మెట్రో ఏర్పాటు చేసినప్పుడు నుంచి ఎంతోమంది ప్రయాణికులకు తమ గమ్యస్థానం సమయానికి చేరుస్తుంది. దీంతో అందరూ మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పడు మెట్రో ప్రయాణం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. తరుచుగా సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ మార్గంలో తరుచుగా సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. మెట్రో ట్రైన్ సులభంగా గమ్య స్థానాలకు చేర్చేది. కానీ ఇప్పుడు మెట్రో రైలు సాంకేతిక లోపాల వల్ల తరచూ ప్రయాణికులను ఇబ్బందులు పెడుతోంది.ఎక్కువగా అమీర్ పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే మార్గంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. రాయదుర్గం నుంచి అమీర్ పేట్ వచ్చే రూట్ లోనే సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. మెయింటినెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. రాయదుర్గం, అమీర్ పేట్ మార్గంలో తరుచుగా మెట్రోలో సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News