Formula E- Racing: ఇవాళ్టి నుంచి ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు

Formula E- Racing: హుస్సేన్ సాగర్ తీరాన అంతర్జాతీయ రేసింగ్ పోటీలు

Update: 2023-02-11 02:21 GMT

Formula E- Racing: ఇవాళ్టి నుంచి ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు

Formula E- Racing: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసే ఫార్ములా-ఈ రేసు ఇవాళ్టినుంచి ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దాదాపు 21వేల మంది పోటీలను వీక్షించేలా ఏర్పాటు చేశారు.

ఈ రేసింగ్ పోటీల నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఆమార్గాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఈ కార్ రేసింగ్ వల్ల ప్రయోజనాలను పక్కనబెడితే.. ప్రాథమికంగా వాహన చోదకులు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ట్రాఫిక్ సమస్య ఏంటని వాహన చోదకులు విచారం వ్యక్తంచేశారు.

ఈ రేసింగ్ పోటీల్లో ప్రాక్టీస్ ఉత్సాహాన్ని పెంపొందించింది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఓ దశలో హైదరాబాద్‌ ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చేశాయి. ట్రాక్ పైకి వాహనాలు ఎలా వచ్చాయోనని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు. ట్రాక్ పైకి వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టారు.

యువతరాన్ని ఉర్రూతలూగించే ఈ రేసింగ్ ఏర్పాట్లతో హుస్సేన్ సాగరతీరం ముస్తాబైంది. పోలీసుల బందోబస్తు, అత్యంత జాగ్రత్తల నడుమ జరిగే ఈ రేసింగ్ పోటీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు.

Tags:    

Similar News