Jagadeeswar Reddy: శాసనమండలి మాజీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి (72) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా జగదీశ్వర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్ లకు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. వివాద రహితుడిగా పేరున్న జగదీశ్వర్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. మరోవైపు ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.