ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టులో ఊరట

Jeevan Reddy: ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్‌మాల్ కార్యకలాపాలు.. యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు

Update: 2024-05-24 06:42 GMT

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టులో ఊరట

 Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్‌మాల్ కార్యకలాపాలు.. యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో జీవన్‌మాల్, మల్టీప్లెక్స్ ప్రారంభమయ్యింది. ఆర్టీసీ అధికారులు మాల్‌కు తాళాలు తీశారు. కోర్టు ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డి మాల్ తెరుచుకుంది. ఈనెల 16న జీవన్‌రెడ్డి‌మాల్‌ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. 3 కోట్ల 50 లక్షల బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు మాల్‌ను సీజ్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జీవన్‌‌మాల్‌ను ఓపెన్ చేశారు.

Tags:    

Similar News