Non-veg: వీక్‌ఎండ్స్‌లో కిటకిటలాడుతున్న నాన్‌వెజ్ మార్కెట్లు

Non-veg: కొవిడ్ నిబంధనలు గాలికొదిలేసిన జనం * హైదరాబాద్‌ రాంనగర్ చేపల మార్కెట్‌కి ప్రసిద్ధి

Update: 2021-05-30 12:05 GMT

ఫిష్ మర్కెట్స్ (ఫైల్ ఇమేజ్)

Non-veg: ప్రస్తుతం జనం ఇమ్మూనిటీ పెంచుకునేందుకు ఎక్కువగా నాన్‌వెజ్‌ తింటున్నారు. లాక్‌డౌన్‌ కారణంతో రోజు మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకోలేకపోయినా.... వీక్‌ ఎండ్స్‌లో మాత్రం ఖచ్చితంగా నాన్‌ వెజ్‌ తింటున్నారు. దాంతో ఒక్కసారిగా ఆయా నాన్‌వెజ్‌ మార్కెట్లు రద్దీతో నిండిపోతున్నాయి. ఆ రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసులు పలు ఆంక్షలు పెడుతున్నారు. దాంతో చేపల వ్యాపారులకు ఆర్ధికంగా దెబ్బ పడుతోంది.

ఆదివారం వస్తే చాలు నాన్‌వెజ్‌ షాపులు, మార్కెట్లు రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆ సమయంలో జనం ఎక్కడా కోవిడ్‌ నిబంధనలు పటిస్తున్నట్లు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో పోలీసులు చేపల వ్యాపారులకు పలు ఆంక్షలు విధించారు. నగరంలో రాంనగరర్ చేపల మార్కెట్‌కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చేపలు కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో చేపలు కట్‌ చేసేందుకు నిరాకరించారు. దాంతో చేపలు కట్‌ చేసి ఉపాధి పొందేవారు బావురుమంటున్నారు.

ఐతే, కరోనా మూలంగా జనం నాన్‌వెజ్‌ ఎక్కువగా తింటున్నారని, వీక్‌ఎండ్స్‌లో తమకు చేపల వ్యాపారం జోరుగా సాగుతుందని చేపల వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ తర్వాత తమకు గిరాకీ ఎక్కువగా ఉందని అంటున్నారు. లాక్‌డౌన్ దృష్ట్యా పోలీసుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని... వాటిని ఇంకాస్త సడలిస్తే బావుంటుందని చేప వ్యాపారులతో పాటు దానిపై ఆధార పడి ఉపాధి పొందుతున్నవారు కోరుతున్నారు.

Tags:    

Similar News