Fire Accident: కామారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

Fire Accident: స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Update: 2024-06-01 05:03 GMT

Fire Accident: కామారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం

Fire Accident: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెత్తకు మంటపెట్టడంతో.. స్క్రాప్ షాపులోకి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News