బండి సంజయ్ పాద్రయాత్రలో ఉద్రిక్తత.. సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా రాళ్లదాడి
Janagaon: టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Janagaon: టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా రాళ్లదాడి జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బండి సంజయ్ పాదయాత్రపై వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి ఫైరయ్యారు. వాస్తవాలు చెప్పకుంటే ప్రజలు పాదయాత్రలు అడ్డుకుంటారని కామెంట్ చేశారు. తెలంగాణకు బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు.