Kamareddy: కామారెడ్డిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
Kamareddy: మాస్టర్‌ప్లాన్ రద్దుతో పాటు మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని డిమాండ్
Kamareddy: కామారెడ్డిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాస్టర్‌ప్లాన్ రద్దు కోరుతూ పాత రాజంపేటలో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సమావేశమైంది. 8 విలీన గ్రామాల రైతుల భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు రైతులు. మరోవైపు మాస్టర్‌ప్లాన్ రద్దుతో పాటు మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విలీన గ్రామాల మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయాలంటూ ఈ నెల 20వ తేదీ వరకు సమయం ఇచ్చారు. రాజీనామా చేయకపోతే ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో రైతులకు నచ్చజెప్పేపనిలో పడ్డారు మున్సిపల్ కౌన్సిలర్లు.