Nizamabad: ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్
Online Betting: నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఓ కుటుంబం బలైంది.
Online Betting: నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఓ కుటుంబం బలైంది. గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగుల్లో పెద్దమొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. అప్పలపాలు కావడంతో.. తల్లిదండ్రులతోపాటు కొడుకు ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆన్‌లైన్ బెట్టింగులు గ్రామాల్లో కుటుంబాలనే బలి తీసుకుంటున్నాయని గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.