నిజామాబాద్ పోలీసుల మెడకు నకిలీ పాస్‌పోర్టుల ఉచ్చు

Update: 2021-02-07 05:29 GMT

Representational Image

 నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా బంగ్లా దేశీయులకు పాస్ పోర్టులు జారీ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు విచారణ చేపట్టారు. ఓ ఎస్సై హెడ్ కానిస్టేబుల్ తో పాటు మీ సేవా కేంద్రం నిర్వహకున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు ఇద్దరు బంగ్లాదేశీయులు పట్టుబడగా వారి పాస్ పోర్టులు బోధన్ కేంద్రంగా జారీ చేసినట్లు గుర్తించడంతో..ఈ వ్యవహారం బయటపడింది.

 రెండు రోజులుగా గుట్టుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. బంగ్లా దేశీయులకు స్ధానికంగా ఆధార్ కార్డులు సృష్టించి పాస్ పోర్టులు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. పాత్ బోధన్ కు చెందిన ఓ మీసేవా కేంద్రం నిర్వాహాకుడు కీలక పాత్ర పోషించినట్లు ఎస్.బి.పోలీసులు సహకారం అందిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బోధన్ ను నివాస కేంద్రంగా చూపి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాస్ పోర్టు దరఖాస్తులను క్షేత్రస్ధాయిలో పరిశీలించకుండా పాస్ పోర్టు దృవీకరించారు. బంగ్లా దేశీయులకు నకిలీ దృవీకరణ పత్రాలు సృష్టించడంలో ఓ మీ సేవా కేంద్రం నిర్వహాకుడు కీలక పాత్ర పోషించారు. ఆ దృవీకరణ పత్రాల ఆధారంగా పాస్ పోర్టు జారీ అయ్యింది. నకిలీ పాస్ పోర్టుల వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం సృష్టిస్తోంది.

Full View


Tags:    

Similar News