తెలంగాణలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌ల నియామకానికి ఎదురుచూపులు
* రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ల నియామకానికి ప్రణాళికలు * సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు * నియామక ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన *వీసీ పోస్టుకు సంబంధించి..మూడు పేర్లలో ఒకదానికి గవర్నర్ ఆమోదం
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ల నియామకం జరగలేదు. ప్రధానంగా కోవిడ్ కారణాలు, వర్షాలు-వరదలు, ఎన్నికల కోడ్‌తో ఆగిపోయింది. అయితే ఇప్పుడు అన్నీ పనులు పూర్తి కావడంతో యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు అడుగులు పడుతున్నాయి. తెలంగాణలోని వైస్ ఛాన్సలర్‌ల నియామకం, పోస్టుల భర్తీపై స్పెషల్ స్టోరీ...
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వైస్-ఛాన్సిలర్‌ల నియామకం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు, నాలుగు వారాల్లో విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్-ఛాన్సిలర్‌ల నియామకాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయబడుతున్నాయి. అటు నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
యూనివర్సిటీలకు వైస్-ఛాన్సిలర్‌లను ఎన్నుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన శోధన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరు నియామక ప్రక్రియలో దరఖాస్తుల పరిశీలన చేసి.. ముగ్గురు అర్హత గల అభ్యర్థుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాయి. ఇవన్నీ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ అయిన గవర్నర్‌కు పంపబడుతాయి. ఈ మూడు పేర్ల నుండి వీసీ పోస్టుకు గవర్నర్ ఒకదాన్ని ఆమోదిస్తారు.
రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీ పోస్టుల కోసం 984దరఖాస్తులు వచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టుకు 142మంది, శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ పోస్టుకు 125మంది, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ పోస్టుకు 124మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ పోస్టుకు 122మంది, ఉస్మానియా యూనివర్సిటీ, నిజామాబాద్ యూనివర్సిటీ పోస్టుకు 114మంది, కాకతీయ యూనివర్సిటీకి 110మంది, జేఎన్‌టీయూకు 56, పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ వీసీ పోస్టుకు 23మంది దరఖాస్తు చేసుకున్నారు.
తొమ్మిది యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం 984 దరఖాస్తులు
డా.బీర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 142మంది
శాతవాహన విశ్వవిద్యాలయం వీసీ పోస్టుకు 125మంది
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి 124మంది దరఖాస్తు
పాలమూరు యూనివర్సిటీ పోస్టుకు 122మంది
ఉస్మానియా, నిజామాబాద్ యూనివర్సిటీకి 114మంది
కాకతీయ యూనివర్సిటీ వీసీ పోస్టుకు 110మంది
జేఎన్‌టీయూ వీసీ పోస్టుకు 56మంది దరఖాస్తు
పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ వీసీ పోస్టుకు 23మంది దరఖాస్తు
ప్రస్తుతం యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలుగా కొందరు ఐఏఎస్‌లు కొనసాగుతున్నారు. వారితోనే ప్రస్తుతం యూనివర్సీటీలు కొనసాగుతున్నాయి. మరోవైపు పోస్టుల భర్తీలో వస్తున్న ఆటంకాలను అధిగమించేందుకు అవసరమైతే చట్ట సవరణలు చేసి అయినా సరే పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.