జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ

* రేపు కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం, ఆపై మేయర్ ఎన్నిక * మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన బల్దియా * నేటితో ముగియనున్న పాలకమండలి పదవీకాలం

Update: 2021-02-10 03:28 GMT

Representational Image

మరికొద్ది గంటల్లో జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత మేయర్ ఎన్నికకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది బల్దియా.

అయితే హైదరాబాద్‌ మహానగరానికి కాబోయే మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎవరనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థుల పేర్లు చెప్పకపోవడం.. పీఠం దక్కించుకునే బలం ఏ పార్టీకి లేకపోవడంతో ఈ సారి గ్రేటర్ వార్‌ ఉత్కంఠ రేపుతోంది.

 జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కార్పొరేటర్లు 149 మంది ఉండగా 44 మంది ఎక్స్‌అఫిషియో మెంబర్లు ఉన్నారు. దీంతో కౌన్సిల్‌లో బలం 193కు చేరింది. ఇందులో కనీసం 97 మంది హాజరైతేనే మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.ప్రస్తుతం కౌన్సిల్‌లో టీఆర్ఎస్‌ బలం 88 కాగా, బీజేపీకి 49, ఎంఐఎంకు 54 మంది బలం ఉంది. 

Tags:    

Similar News