అంత్యక్రియల వివాదంపై..స్పందించిన మంత్రి ఈటల రాజేందర్
వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియల విషయం వివాదాలను దారితీసింది. కరోనా బారిన మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను తమకు తెలియకుండా, తమ నుంచి అనుమతి తీసుకోకుండా పూర్తి చేసారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
వనస్థలిపురంలో కరోనా మృతుడి అంత్యక్రియల విషయం వివాదాలను దారితీసింది. కరోనా బారిన మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను తమకు తెలియకుండా, తమ నుంచి అనుమతి తీసుకోకుండా పూర్తి చేసారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.తన భర్త అంత్యక్రియల విషయం తమకు కాస్త కూడా తెలపలేదని జీహెచ్‌ఎంసీ, గాంధీ ఆస్పత్రిపై మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతూ ట్వీట్ చేశారు.
పూర్తి వివరాల్లోకెళితే వనస్థలిపురంలో నివాసం ఉంటున్న మధుసూదన్ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో అధికారులు వారందరినీ గాందీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులందరూ కోలుకుని డిశ్చార్జి కాగా మధుసూదన్ కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో అతన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. ఆసుపత్రి సిబ్బందిని మధుసూదన్ కుటుంబ సభ్యులు ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
వారు స్పందించక పోవడంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ మాధవి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాగయినా ఈ విషయంలో తమకు సాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త మాత్రం కనిపించడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. మృతుడు కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే చనిపోయాడని తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఆ తరువాతే పోలీసులకు మృతదేహాన్ని అప్పగించామని తెలిపారు.
ఇక ఇదే విషయంపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్ కూడా స్పందించారు. 'వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ఈశ్వరయ్య కుటుంబ సభ్యులందరూ కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. కాగా వారిని వైద్య సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్న 24 గంటల్లోనే ఈశ్వరయ్య చనిపోయారన్నారు. అతని కూమారుడు ( మాధవి భర్త ) కూడా అదే రోజు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా ఈ నెల 1వ తేదీన చనిపోయారన్నారు. అతని మృతి విషయం భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు ఈ విషయం చెప్పలేదని, పోలీసులకు చెప్పామన్నారు. అప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయిన షాక్ లో వారు ఉన్నారని, మరొకరి మృతి గురించి చెబితే తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా అన్నారని తెలిపారు. అంతే కాక వారి కుటుంబ సభ్యులంతా చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే ఉండడంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసిందన్నారు.