Etela Rajender: బిడ్డా గుర్తు పెట్టుకో.. నువ్వు ఎన్ని టాక్స్‌లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా.?

Etela Rajender: ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడానికి హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఈటల అన్నారు.

Update: 2021-05-18 06:05 GMT

Etela Rajender Press Meet in Huzurabad

Etela Rajender: ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడానికి హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఈటల అన్నారు. తన బొందిలో ప్రాణమున్నంత వరకూ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని తెలిపారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని టీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి అన్నారు. నోరు అదుపులో లేకపోతే కరీంనగర్ నుంచే ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హుజారాబాద్ ఎన్నిక జరిగితే తనకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటారని ఈటల ధీమా వ్యక్తం చేసారు.

ఈటల మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా? ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా ? తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలని అన్నారు. బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బతకరు.. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్.. బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. నువు ఎన్ని ట్యాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.

2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది.. అదే గతి నీకు పడుతుందని చురకలు అంటించారు. 2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, YS రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్న. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారు." అంటూ ఈటల టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Tags:    

Similar News